ఎందుకయా సాంబశివ...
ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ
ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ... ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ..
ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ సాంబశివా
అలల తోటి గంగ పట్టి తలపాగా చుట్టి...
నెలవంకను మల్లె పూవు కలికితురాయిగ పెట్టి…ఎందుకయా సాంబశివా
సాంబశివ సాంబశివా
తోలు గట్టిపటకాగా కాలాహిని కుట్టి...
కేల త్రిశూలముపట్టి ఫాలమందు కీల పెట్టి... ఎందుకయా సాంబశివా
సాంబశివ సాంబశివా
రుద్రుడవో కారుణ్య సముద్రడవో హర హర హర...
ఎందుకయా ఈ దాసునకందవయా దయామయా.. ఎందుకయా సాంబశివా
సాంబశివ సాంబశివా