12, నవంబర్ 2020, గురువారం

చరణాలు చరణాలు - శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి - Seshu kumari Duvvuri


 చరణాలు చరణాలు ముక్తి సోపానాలు

శరణన్న వారికవి మోక్ష భవనాలు ధరణిసిరి హ్రుదయాల కనరారు చరణాలు గిరిజేశ వాక్పతులు కీర్తించు చరణాలు విరిచూపు గలవాని నిరతించుచు చరణాలు సరయూ నదీతటిని తరియించు చరణాలు అజ్ఞాన తిమిరమున విజ్ఞాన కిరణాలు సుజ్ఞానులకు సకల సౌవర్ణాభరణాలు శాంతికవి నిలయాలు సౌందర్య వలయాలు సంతోష ద్వారాలు సకల స్మృతితీరాలు