5, నవంబర్ 2020, గురువారం

ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు - Seshu kumari Duvvuri


 ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ

శాశ్వతైశ్వర్యమిచ్చి సదా నన్ను బ్రోచునో సకల బాధలను బెట్టి సంకటబడ చూచునో పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ వెరువకుమని అభయమిచ్చి వేగమె రక్షించునో ఈ అధముడు దుష్టుడనుచు వెరువక శిక్షించునో పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ ఎందు కొరత లేని బ్రహ్మానందమొసగునో ఎప్పటికీ లాగునదే హింస బరచి వేచునో పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ ధారుణిలో నన్ను భగవదాసుకోటి చేర్చునో ధారపుత్రాదుల వల తగులుకొనక జూచునో పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ కూరిమితో సుదర్శనం కొప్పున దయ చేయునో పొరమాలిన మానవులను కొనియాడగా జేయునో పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ